MLA: ఎమ్మెల్యే ఆర్కే అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వినతిపత్రం అంటించిన రైతులు

  • ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రైతులు
  • రైతులకు నిరాశ
  • అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంతో భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అమరావతి రైతులు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించుటలేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

దీనిపై ఎమ్మెల్యే ఆర్కే వివరణ ఇస్తూ, వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళితే ఇంత రాద్ధాంతమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రాజధాని రైతులకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే ఆర్కే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి వినతిపత్రాన్ని అంటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

MLA
Alla Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh
Amaravathi
Farmers
Telugudesam
  • Loading...

More Telugu News