Andhra Pradesh: ఏపీ సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
- టియర్ గ్యాస్, వాటర్ కెనన్స్ వాహనాల మోహరింపు
- తుపాకులు, లాఠీలతో అక్కడికి చేరుకున్న పోలీసులు
- మందడం రైతులకు మరోమారు నోటీసులు
జీఎన్ రావు కమిటీ నివేదికపై రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానున్న విషయం తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించే ఉద్దేశంలో వున్న ప్రభుత్వం తీరుపై అక్కడి రైతులు నిరసనలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్స్ వాహనాలతో పాటు తుపాకులు, లాఠీలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, మందడం రైతులకు మరోమారు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు వుంటాయని హెచ్చరించారు. రేపు నిరసనలకు దిగబోమంటూ సంతకాలు చేయాలంటూ అక్కడి రైతులపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే, సంతకాలు చేసేందుకు మందడం రైతులు నిరాకరించినట్టు సమాచారం.