GN Rao committee: జీఎన్ రావు కమిటీ నివేదిక మంచిదని నమ్ముతున్నాం.. సపోర్టు చేస్తాం: అంబటి రాంబాబు

  • సీఎంతో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం 
  • కమిటీ సిఫారసులు, సీఎం నిర్ణయాన్ని శిరసావహిస్తాం
  • మా ప్రాంతమూ అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నా

ఏపీ సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు కమిటీ సిఫారసులు, సీఎం జగన్  నిర్ణయాన్ని తాము శిరసావహిస్తామని, అది మంచిదని నమ్ముతున్నామని... దానికి సపోర్టు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జీఎన్ రావు నివేదిక ఆధారంగా తమ ప్రాంతానికి కూడా అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పారు.  

GN Rao committee
cm
Jagan
YSRCP
Ambati
  • Loading...

More Telugu News