TS RTC special busses: సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

  • 4940 బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటన
  • జనవరి 10 నుంచి 13వరకు ఈ సౌకర్యం
  • ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉందని వెల్లడి

సంక్రాంతి పండగను సొంతూళ్లలో జరుపుకునేందుకు తరలుతున్న ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 4940 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 10 ఉంచి 13వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ రోజు ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు. పండగ రద్దీని తట్టుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేవారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ బస్సుల్లో ప్రయాణించడానికి ముందుగా రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు.

TS RTC special busses
For Sankranthi
4940 special busses
  • Loading...

More Telugu News