Mamatha Banarjee: ఎన్పీఆర్, ఎన్నార్సీ అంటూ కేంద్రం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది: మమతా బెనర్జీ

  • కేంద్రంపై మమత ధ్వజం
  • ప్రజల్లో విద్వేషాలు నింపుతున్నారంటూ ఆగ్రహం
  • బెంగాల్ పై సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యలు

కేంద్రం తీసుకువస్తోన్న ఎన్పీఆర్, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ కోల్ కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎన్డీయే సర్కారుపై ధ్వజమెత్తారు. ఎన్పీఆర్, ఎన్నార్సీల పేరుతో కేంద్రం ప్రజల్లో విద్వేషాలను నింపుతోందని మండిపడ్డారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత చట్టాలను విమర్శిస్తూ, తన తల్లి పుట్టినతేదీ, జన్మస్థలం తనకే తెలియవని, అలాంటప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించారు. అంతేగాకుండా,  పశ్చిమ బెంగాల్ పై సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Mamatha Banarjee
West Bengal
TMC
NDA
NPR
NRC
BJP
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News