Sai Tej: 6 రోజుల్లోనే వసూళ్లతో అదరగొట్టేసిన 'ప్రతిరోజూ పండగే'

  • ఈ నెల 20న వచ్చిన 'ప్రతిరోజూ పండగే'
  • విడుదలైన ప్రతి చోటా విజయవిహారం 
  • నైజామ్ లో అత్యధిక వసూళ్లు 

మారుతి దర్శకుడిగా .. సాయితేజ్ - రాశి ఖన్నా జంటగా నిర్మితమైన 'ప్రతిరోజూ పండగే' సినిమా, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో .. బంధాలు - అనుబంధాల విలువను చాటుతూ ఆవిష్కరించబడిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను నమోదు చేస్తూ వెళుతోంది.

ఈ సినిమా విడుదలైన ఈ 6 రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా 33.80 కోట్ల గ్రాస్ ను .. 18.43 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 6 రోజుల్లో 6.52 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయితేజ్ కెరియర్లో ఇక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. బలమైన కథాకథనాలు .. ఆకట్టుకునే పాటలు .. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు .. మనసును తాకే మాటలు ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News