Aravind: ప్రకటన కూడా రాని ఎన్నార్సీపై రాద్ధాంతం చేస్తున్నారు: కేసీఆర్, ఒవైసీలపై ఎంపీ అరవింద్ విసుర్లు

  • సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఒవైసీ సోదరులు
  • స్పందించిన బీజేపీ యువ ఎంపీ
  • మత రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపాటు

కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్నార్సీ, సీఏఏలను తెలంగాణలో అమలు చేయవద్దంటూ ఒవైసీ సోదరులు సీఎం కేసీఆర్ ను కలవడంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటుగా స్పందించారు. ఎన్నార్సీపై ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా రాలేదని, కానీ, దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీ చేతిలో కీలుబొమ్మగా మారిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో మతసామరస్యాన్ని ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.  సీఏఏతో భారతదేశ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని, కీలకమైన పురపాలక ఎన్నికల ముందు కేసీఆర్, ఒవైసీ మత రాజకీయాలకు తెరలేపారంటూ ఆరోపించారు.

Aravind
Nizamabad
Telangana
KCR
Asaduddin Owaisi
Akbaruddin Owaisi
BJP
MIM
  • Loading...

More Telugu News