Shabbir Ali: కాంగ్రెస్ లో రెడ్లు, బీసీలు చీలిపోయారు: షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

  • వాడివేడిగా టీకాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
  • వాకౌట్ చేసిన వి.హనుమంతరావు
  • టీఆర్ఎస్ విమర్శలపై నాయకులు స్పందించలేదన్న ఉత్తమ్

హైదరాబాదులో ఈరోజు జరిగిన టీకాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగింది. కోర్ కమిటీలో సభ్యులు కానివారిని కూడా సమావేశానికి పిలిచారంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు వాకౌట్ చేశారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై తాను చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేసినా... కాంగ్రెస్ నేతలు స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టకపోవడం తప్పేనని అన్నారు. పార్టీలో రెడ్లు, బీసీలు చీలిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shabbir Ali
Congress
VH
Uttam Kumar Reddy
TRS
  • Loading...

More Telugu News