Amaravathi: ఆందోళన విరమించాలని రాజధాని రైతులను కోరుతున్నాం: హోం మంత్రి సుచరిత

  • అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
  • రేపు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం
  • ఆందోళనల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు

రాజధాని రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నామని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. రేపు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుందని, రైతుల ఆందోళనల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీ దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేక ఐపీఎస్ అధికారి 

‘ఏపీ దిశ’ చట్టం అమలు కోసం రూ.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను నియమిస్తున్నామని, మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో పని చేసే 176 మంది సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామని, మహిళా పోలీస్ స్టేషన్లను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News