Kesineni Nani: కేశినేని నాని, బుద్ధా వెంకన్నలను గృహ నిర్బంధం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం

  • నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్న చంద్రబాబు
  • అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదా అంటూ మండిపాటు
  • భారీ మూల్యం చెల్లించుకుంటారంటూ హెచ్చరిక

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నలను గృహనిర్బంధం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ కు వెళ్లకుండా తమ నాయకులను అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కనీసం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా మాకు లేదా? అని నిలదీశారు.

ఏకపక్ష విధానాలు, నిరంకుశ పోకడలు, అణచివేత విధానాలకు వైసీపీ సర్కారు భారీ  మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఐదేళ్లు సాఫీగా సాగే రాజధానిని వివాదం పాలుచేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని గ్రామాల ప్రజలను వేలాది పోలీసుల సాయంతో భయాందోళనలకు గురిచేస్తున్నారని,  ప్రజాగ్రహంలో జగన్ వంటి నియంతలు కూడా కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.

Kesineni Nani
Buddha Venkanna
Telugudesam
YSRCP
Andhra Pradesh
Amaravathi
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News