Arundhati Roy: వారి పేర్లను అరుంధతి రాయ్ ఉచ్చరించడం సిగ్గుచేటు: ఉమాభారతి

  • అరుంధతి పేరు పలకడానికి సిగ్గుపడుతున్నా
  • ఆమెది ఒక విచిత్రమైన మనస్తత్వం
  • ఆమెది మహిళా వ్యతిరేక ఆలోచనాధోరణి

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ పై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు ఉమాభారతి మండిపడ్డారు. బిల్లా, రంగా వంటి వారి పేర్లను ఆమె పలకడం సిగ్గుచేటని అన్నారు. ఆమె పేరు పలకడానికి కూడా తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఆమెది మహిళా వ్యతిరేక, మానవత్వ వ్యతిరేక ఆలోచనాధోరణి అని అన్నారు. ఆమెది ఒక విచిత్రమైన మనస్తత్వమని విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులైన అష్ఫకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ వంటి పేర్లను ఆమె ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ మేరకు ఉమాభారతి వరుస ట్వీట్లు చేశారు.

సీఏఏ నిరసనకారులను ఉద్దేశిస్తూ ఢిల్లీ యూనివర్శిటీలో నిన్న అరుంధతి రాయ్ మాట్లాడారు. ఎన్పీఆర్ వివరాల కోసం అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన పేర్లు కాకుండా... బిల్లా, రంగా, కుంగ్ ఫు కుట్టా వంటి పేర్లను చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే, అరుంధతిపై ఉమాభారతి విమర్శలు గుప్పించారు.

Arundhati Roy
Uma Bharati
BJP
CAA
  • Loading...

More Telugu News