JAC: జేఏసీ నేతలకు ఏపీ హోం మంత్రి సుచరిత అపాయింట్‌మెంట్ నిరాకరణ

  • అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్
  • ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలు
  • సుచరిత తీరుపై నేతల మండిపాటు

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసేందుకు ప్రయత్నించిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించారు. ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తున్న అమరావతి పరరక్షణ సమితి నేతలు.. అందులో భాగంగా హోం మంత్రికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరు సరికాదని మండిపడుతున్నారు.

JAC
Amaravathi
sucharitha
Andhra Pradesh
  • Loading...

More Telugu News