Banjara hills: బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించిన కారు.. పలువురికి గాయాలు

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • కారును ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి
  • ప్రాణభయంతో పరుగులు తీసిన జీహెచ్ఎంసీ కార్మికులు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో రోడ్లను  శుభ్రం చేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కారులో ఉన్న ముగ్గురు యువకులు అత్తాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Banjara hills
Hyderabad
car
  • Loading...

More Telugu News