Andhra Pradesh: గుంటూరులో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు

  • పాత గొడవల నేపథ్యంలో పెల్లుబికిన రాజకీయ కక్షలు
  • ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య బాహాబాహీ  
  • దాడుల్లో పలువురికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు పెల్లుబికాయి. పాతగొడవల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ తమ  గ్రామాలకు వచ్చిన నేపథ్యంలో పాతగొడవలు బయటపడినట్లు తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎన్నికల నాటి గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపులు బాహాబాహీకి దిగాయి.  అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. పాతకక్షల నేపథ్యంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రెండు వర్గాల నడుమ కొట్లాట చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సమాచారం.  

Andhra Pradesh
Guntur District
Two Groups fight each other
  • Loading...

More Telugu News