Karnataka: సీఏఏపై నిరసనల సందర్భంగా.. మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఉపసంహరించిన కర్ణాటక ప్రభుత్వం
- ఈ నెల 19న జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు
- మృతులు నేరస్థులు అని తెలియడంతో ఉపసంహరణ
- నేరస్థులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం క్షమార్హం కాని నేరమన్న సీఎం యడియూరప్ప
సీఏఏను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సీఎం యడియూరప్ప ఓ ప్రకటన చేశారు. ఆందోళనల్లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు నేరస్థులని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చేపట్టామని చెప్పారు.
‘నేరస్థులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడమనేది క్షమార్హం కాని నేరమవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది’ అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. మంగళూరులో ఈ నెల 19న జరిగిన ‘పౌరసత్వ’ నిరసనల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.