Telangana: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు

  • ఆర్టీసీలోని ఉద్యోగులందరికీ వర్తింపు
  • సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
  • ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇది కచ్చితంగా తీపి వార్తే. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఈమేరకు సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు. ఆర్టీసీ, కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల నేపథ్యంలో ఈ పదవీ విరమణ వయసును పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Telangana
RTC Employees retirement age extended
From 58 to 60 years
  • Loading...

More Telugu News