Muthoot Finance: ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ... 77 కిలోల బంగారం చోరీ!

  • బెంగళూరు లింగరాజపురం బ్రిడ్జ్ సమీపంలో శాఖ
  • గోడకు కన్నమేసి, సీసీ కెమెరాలు తొలగించి చోరీ
  • తెలిసిన వారి ప్రమేయంపై పోలీసులు విచారణ

కర్ణాటకలోని ఓ ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అత్యంత భారీ దొంగతనం జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి – హెణ్ణూరు రోడ్‌ లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.

ఓ పథకం ప్రకారం ఈ ఘరానా దొంగతనం జరిగింది. గోడకు కన్నమేసి లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగతనం జరిగిన తీరును గమనించి, లోపలి పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో విచారణ ప్రారంభించారు.

Muthoot Finance
Karnataka
Theft
  • Loading...

More Telugu News