Vice president Venkaiah Naidu comments on AP Capital Issue: రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • నిట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి 
  • ప్రస్తుత వివాదానికి నా వ్యాఖ్యలకు సంబంధలేదని స్పష్టీకరణ
  • రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై వెల్లువెత్తుతోన్న నిరసనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. అన్నీ ఒకేచోట పెట్టాలనడం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలోని 'నిట్' స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదన్నారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న రాజధాని వివాదానికి, తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు.

Vice president Venkaiah Naidu comments on AP Capital Issue
  • Loading...

More Telugu News