Kalyan Dev: కన్నడలోను విడుదల కానున్న కల్యాణ్ దేవ్ మూవీ

- కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా 'సూపర్ మచ్చి'
- కథానాయికగా రచితా రామ్
- సంగీత దర్శకుడిగా తమన్
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఆ మధ్య 'విజేత' అనే సినిమా చేశాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా, లుక్ పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు పడ్డాయి. నటన పరంగా ఫరవాలేదు అనిపించుకున్నాడు. ఆ తరువాత సినిమాగా 'సూపర్ మచ్చి' రూపొందుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు పులివాసు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
