Krishna Kishore: ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ ను ఎందుకు రిలీవ్ చేయలేదు?: ఏపీ ప్రభుత్వంపై క్యాట్ సీరియస్

  • కృష్ణకిశోర్ ను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం  
  • కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు?
  • తక్షణమే వివరణ ఇవ్వండి

ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ ను సస్పెండ్ చేయడంపై ఏపీ ప్రభుత్వంపై క్యాట్ సీరియస్ అయింది. కృష్ణకిశోర్ ను ఎందుకు రిలీవ్ చేయలేదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని అడిగింది. తక్షణమే వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిశోర్ ను 10 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. మరోవైపు, ఇదే వ్యవహారంలో హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.

Krishna Kishore
IRS
CAT
Andhra Pradesh
  • Loading...

More Telugu News