mamata banerjee: నాలో నెలకొన్న తీవ్రమైన ఆవేదనతో విపక్ష నేతలకు లేఖలు రాస్తున్నాను: మమతా బెనర్జీ

  • కేంద్ర ప్రభుత్వ అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాడదాం
  • సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా కలుద్దాం
  • భారత పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీలు భయపడుతున్నారు
  • దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

దేశాన్ని రక్షించేందుకు ఏకం కావాలని కోరుతూ దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీయేతర నేతలకు లేఖలు రాస్తూ.. కేంద్ర ప్రభుత్వ అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా బెనర్జీ అన్నారు. తనలో నెలకొన్న తీవ్రమైన ఆవేదనతో లేఖలు రాస్తున్నానని చెప్పారు.

సీఏఏ, ఎన్ఆర్సీపై కులంతో సంబంధం లేకుండా భారత పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు,  చిన్నారులు, మహిళలు భయపడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. వాటిపై పోరాటానికి సీనియర్ నాయకులు, రాజకీయ నేతలు అందరూ ఏకమై పోరాటం చేయాలని కోరుతున్నానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యాన్ని  కాపాడుదామని చెప్పారు.

  • Loading...

More Telugu News