Ganta Srinivasa Rao: విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాను: గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

  • విశాఖపట్నం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది
  • విశాఖను పరిపాలనపరమైన రాజధానిని చేస్తేనే ఏపీ అభివృద్ధి
  • ఈ నగరంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారు 

రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మరోసారి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ వాసిగా తాను జగన్‌ ప్రకటనపై మాట్లాడుతున్నానని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నానని చెప్పారు.

విశాఖపట్నం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని గంటా శ్రీనివాసరావు అన్నారు. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనల వల్ల ఏపీలోని అన్ని ప్రాంతాలకు  సమన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.  అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఇది సాధ్యమని చెప్పారు. విశాఖను పరిపాలనపరమైన రాజధానిని చేస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఆ నగరంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారని ఆయన చెప్పారు. అలాగే, అమరావతి రైతులకి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని గంటా అన్నారు.

Ganta Srinivasa Rao
Telugudesam
amaravati
  • Loading...

More Telugu News