Jagi John: మలయాళ టీవీ సెలబ్రిటీ చెఫ్ అనుమానాస్పద మృతి!

  • వంటగదిలో జాగీజాన్ మృతదేహం
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్నేహితురాళ్లు
  • అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్న పోలీసులు

కేరళలో టీవీ సెలబ్రిటీ చెఫ్ గా పేరు తెచ్చుకున్న జాగీ జాన్, తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తిరువనంతపురం పరిధిలోని కురావాన్ కోణం ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వచ్చిన స్నేహితురాళ్లు, ఆమె కోసం వెతుకగా, వంటగదిలో ఆమె మృతదేహం కనిపించింది.

దీంతో వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. ఆమె శరీరంపై ఎటువంటి గాయాలూ లేవని, అనుమానాస్పద మరణంగా కేసును నమోదు చేశామని తెలిపారు. పోస్టుమార్టంలో మరణానికి కారణాలు వెల్లడవుతాయని అన్నారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని, ఆమె కాల్ డేటాను, మరణించడానికి ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడారా? ఎవరైనా కలిశారా? అన్న వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

Jagi John
Kerala
Died
Malayalam
  • Loading...

More Telugu News