India: విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా హర్షవర్ధన్ శృంగ్లా నియామకం

  • అమెరికాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ 
  • విజయ్ గోఖలే స్థానంలో కార్యదర్శిగా నియామకం
  • శృంగ్లా 1984 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ టాపర్

భారత విదేశాంగ శాఖకు నూతన కార్యదర్శి నియామకం జరిగింది. అమెరికాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ శృంగ్లాను విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ గోఖలే స్థానంలో హర్షవర్ధన్ శృంగ్లా బాధ్యతలు స్వీకరిస్తారు. శృంగ్లా 1984 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ లో టాపర్ గా నిలిచారు. శృంగ్లా గతంలో థాయ్ లాండ్ లో భారత రాయబారిగా, బంగ్లాదేశ్ లో భారత హైకమిషనర్ గానూ వ్యవహరించారు.

India
Foreign
Secretary
Harsh Vardhan Shringla
USA
  • Loading...

More Telugu News