Jharkhand: ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కాబోయే సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యలు
- ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమి హవా
- బీజేపీకి నిరాశాజనక ఫలితాలు
- విజయాన్ని తండ్రికి అంకితమిచ్చిన హేమంత్ సోరెన్
దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఈసారి విజయం ముఖం చాటేసినట్టే భావించాలి. జేఎంఎం కూటమికి గణనీయమైన ఆధిక్యం లభించిన నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్ష హోదాతో సర్దుకుపోవాల్సిందే! ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాల సరళిపై జేఎంఎం లీడర్, కాబోయే సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ విజయాన్ని తన తండ్రి శిబు సోరెన్ కు అంకింతం ఇస్తున్నానని తెలిపారు.
శిబు సోరెన్ పోరాటాలు, ఆయన అందించిన స్ఫూర్తి ఫలితమే ఈ విజయం అని, ఝార్ఖండ్ చరిత్రలో నవశకం ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, ఇతర నేతలకు హేమంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.