Disha: దిశ నిందితుడు జొల్లు నవీన్ మృతదేహానికి బొమ్మతో పెళ్లి!

  • దిశ నిందితులకు రీపోస్టుమార్టం పూర్తి
  • మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు
  • నవీన్ అవివాహితుడు కావడంతో బొమ్మతో పెళ్లి!

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తయిన సంగతి తెలిసిందే. అనంతరం మృతదేహాలను నిందితుల స్వస్థలాలకు అంబులెన్స్ లో తరలించారు. గుడిగండ్ల గ్రామానికి కొద్దిసేపటి క్రితమే మృతదేహాలతో కూడిన అంబులెన్స్ లు చేరుకున్నాయి. నవీన్, శివ, చెన్నకేశవులు మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందినవారు కాగా, ఆరిఫ్ స్వస్థలం ఇదే మండలంలోని జక్లేర్ గ్రామం.  అయితే, దిశ నిందితుల్లో ఒకడైన నవీన్ కు పెళ్లి కాకపోవడంతో, ఆచారం ప్రకారం అతని మృతదేహానికి బొమ్మతో పెళ్లి చేయనున్నారు. ఓ కుర్చీపై నవీన్ మృతదేహం, మరో కుర్చీపై బొమ్మను ఉంచి పెళ్లి తంతు జరిపించనున్నారు. ఆ తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, నిందితుల అంత్యక్రియలకు పోలీసులు గ్రామస్తులను తప్ప ఎవరినీ అనుమతించడంలేదు.

Disha
Navin
Telangana
Hyderabad
Gudigandla
Jakler
Makthal
  • Loading...

More Telugu News