Disha: దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి

  • రీపోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు
  • సాయంత్రం కోర్టుకు నివేదిక సమర్పణ
  • మరికాసేపట్లో కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింత

సంచలనం సృష్టించిన దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి కాల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో, వారి మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు  గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. అంతకుముందు మృతదేహాలకు ఎక్స్ రే తీశారు. కాగా, రీపోస్టుమార్టం ప్రక్రియ యావత్తు వీడియోలో చిత్రీకరించారు. నివేదిక వివరాలను సీల్డ్ కవర్ లో ఉంచి ఈ సాయంత్రం కోర్టుకు సమర్పించనున్నారు. మరికాసేపట్లో దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మృతదేహాల తరలింపునకు రెండు అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు.

Disha
Hyderabad
Telangana
Encounter
Police
High Court
Gandhi Hospital
  • Loading...

More Telugu News