Devineni Avinash: మరో 150 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీలో చేర్చిన దేవినేని అవినాశ్

  • ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్
  • విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు వైసీపీలో చేరిక
  • కీలకపాత్ర పోషించిన అవినాశ్

ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న దేవినేని అవినాశ్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈసారి 150 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అవినాశ్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ కు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరినట్టు అవినాశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీరంతా సీఎం జగన్ ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారని, జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

అందరికీ వైసీపీ కండువాలు కప్పిన దేవినేని అవినాశ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలపరిచే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అవినాశ్ ఓటమిపాలవడం తెలిసిందే. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని ఈ యువనేత ఆపై వైసీపీలో చేరారు. సీఎం జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.

Devineni Avinash
Telugudesam
YSRCP
Andhra Pradesh
Vijayawada
  • Loading...

More Telugu News