Akhilapriya: హైకోర్టు పెడితే నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా?: మాజీ మంత్రి అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు
- సీమను ఉద్ధరించామని చెప్పద్దు
- పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది
- అమరావతిలోనే రాజధాని ఉండాలన్న అఖిలప్రియ
రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులు ఉండవచ్చని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది నీళ్లు, పరిశ్రమలని ఆమె అన్నారు.
హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్ధరించామని చెప్పవద్దని కోరిన ఆమె, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సలహా ఇచ్చారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుతోందని అఖిలప్రియ విమర్శలు గుప్పించారు.