Virat Kohli: 'తులా మాన్లా రే ఠాకూర్' మరాఠీ భాషలో కోహ్లీ పొగడ్తలు!

  • వెస్టిండీస్ తో మ్యాచ్ లో భారత్ విజయం
  • చివర్లో శార్దూల్ ఠాకూర్ మెరుపులు
  • ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ ప్రశంసలు

కటక్ వేదికగా, భారత్, వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు, 2-1 తేడాతో సీరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాహుల్ 77, రోహిత్ 63, కోహ్లీ 85 పరుగులు చేసి విజయానికి బాటలు వేయగా, చివరిలో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఆట, జట్టును విజయతీరాలకు చేర్చిన విధానం చాలా కాలంపాటు అభిమానులకు గుర్తుండిపోతుంది.

47వ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే కోహ్లీ అవుట్ కాగా, ఆపై క్రీజులోకి వచ్చిన శార్దూల్ తొలి బంతిని బౌండరీకి పంపాడు. ఆపై కాట్రెల్ ఓవర్ లో సిక్స్, ఫోర్ కొట్టడంతోనే మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే ఇండియా గెలిచింది. మ్యాచ్ అనంతరం జడేజా, శార్దూల్ ఠాకూర్ లను మైదానంలోకి వచ్చి అభినందించిన కోహ్లీ, తన ట్విట్టర్ ఖాతాలోనూ ప్రశంసించాడు. శార్దూల్ మహారాష్ట్ర వాసి కావడంతో, మరాఠీలో ట్వీట్ పెట్టాడు.

కోహ్లీ తన ట్విట్టర్ లో "తులా మాన్లా రే ఠాకూర్‌" (హ్యాట్సాఫ్‌ ఠాకూర్‌) అంటూ పొగిడాడు. ఈ ట్వీట్ వైరల్ అయింది. భారత క్రికెట్ అభిమానులు సైతం శార్దూల్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Virat Kohli
Sarthool Thakur
Twitter
India
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News