Terrorist: అవంతిపొరాలో జైషే మొహమ్మద్ సానుభూతిపరుడి అరెస్ట్

  • ఉగ్రవాదులకు పలు విధాలుగా సహకరిస్తున్న మక్బూల్
  • మరో ఆపరేషన్ లో ఉగ్రవాది మిర్ అరెస్ట్
  • ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ సానుభూతిపరుడు రసిక్ మక్బూల్ ను భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. జమ్మూకశ్మీర్ లోని అవంతిపొరాలో అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు పలు వస్తువులను సరఫరా చేయడంతో పాటు అనేక రకాలుగా మక్బూల్ సహకరిస్తున్నాడు. సైదాబాద్ పస్తూనా గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మక్బూల్ పట్టుబడ్డాడు.

మరో ఆపరేషన్ లో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదిని భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. సోపోర్ లో పట్టుబడ్డ ఈ ఉగ్రవాదిని సద్దాం మిర్ గా గుర్తించారు. ఈ సందర్భంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Terrorist
Jammu And Kashmir
  • Loading...

More Telugu News