Tulluru: ఆరో రోజూ అమరావతిలో ఉద్రిక్తత... టెంట్లు పీకేసిన పోలీసులు!

  • తుళ్లూరులో రహదారిపై టెంట్
  • పోలీసులతో రైతుల వాగ్వాదం
  • నేడు జరగనున్న మహాధర్నా

గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో వరుసగా ఆరో రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం తుళ్లూరు గ్రామంలో రహదారిపై నిరసనకు దిగిన ప్రజలు వేసుకున్న టెంట్ ను పోలీసులు బలవంతంగా తొలగించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, అసెంబ్లీలో సీఎం జగన్, మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మందడం, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతుండగా, రైతులు, విపక్షాలు నేడు మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tulluru
Amaravati
Police
Farmers
Protest
  • Loading...

More Telugu News