Raghava Lawrence: బయటి కార్యక్రమాలకు ఇక హాజరు కాను... అవన్నీ చెప్పలేను: లారెన్స్ నిర్ణయం

  • ఇటీవల కమల్ పై వ్యాఖ్యలు
  • అభిమానుల ట్రోలింగ్
  • ట్విట్టర్ లో స్పందించిన లారెన్స్

కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా, దర్శకుడిగా మారి విజయాలు సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నాడు. దర్బార్ ఆడియో వేడుకలో రజనీకాంత్ పై తన ఆరాధ్యభావం గురించి చెబుతూ, బాల్యంలో కమల్ హాసన్ సినిమా పోస్టర్లపై పేడ కొట్టేవాడ్నని వెల్లడించాడు. ఇప్పుడు రజనీ, కమల్ ఎంతో స్నేహంగా ఉండడం చూసి ఫ్రెండ్షిప్ కంటే గొప్పది ఏదీ లేదని అర్థం చేసుకున్నానని వ్యాఖ్యానించాడు. కానీ కమల్ అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి లారెన్స్ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఇక నుంచి బయటి కార్యక్రమాలకు హాజరుకానని, అది రజనీకాంత్ కార్యక్రమం అయితే ఆయన అనుమతి ఇస్తే వస్తాను తప్ప లేకుంటే రానని ట్విట్టర్ లో తెలిపాడు. తన నిర్ణయానికి అనేక కారణాలున్నాయని, అవన్నీ చెప్పలేనని ట్వీట్ చేశాడు. రజనీ దీవెనల కంటే ఏదీ ఎక్కువకాదని పేర్కొన్నాడు.

Raghava Lawrence
Rajinikanth
Kamal Haasan
Kollywood
Chennai
Tamilnadu
Darbar
  • Loading...

More Telugu News