Hyderabad: హైదరాబాద్ లో ఘటన... కుక్క ఇంట్లోకి వస్తోందని తుపాకీతో కాల్చి చంపిన బ్యాంకు మేనేజర్

  • సరూర్ నగర్ లో కాల్పుల కలకలం
  • బ్యాంకు మేనేజర్ ఇంట్లోకి వెళ్లిన శునకం
  • ఎయిర్ గన్ కు పనిచెప్పిన బ్యాంకు మేనేజర్

హైదరాబాదులో ఓ బ్యాంకు మేనేజర్ తన ఇంట్లోకి కుక్క వస్తోందని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన సరూర్ నగర్ లో జరిగింది. బేగంపేట హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ అవినాష్ బాపూ నగర్ కాలనీలో ఉంటున్నాడు. అయితే, రాజు అనే వ్యక్తికి చెందిన కుక్క తన ఇంట్లోకి రావడంతో అవినాష్ తన ఎయిర్ గన్ తో కుక్కను కాల్చాడు. దాంతో ఆ కుక్క అక్కడిక్కడే మరణించింది. దీనిపై రాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగించింది.

Hyderabad
Dog
Bank Manager
Air Gun
Police
  • Loading...

More Telugu News