CPI: ప్రత్యేకహోదాపై మాట్లాడకుండా... మతాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెడతారా?: వైసీపీ నేతలపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం

  • రాజధాని అంశంపై రగడ
  • స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
  • రాజధాని అమరావతిలోనే కొనసాగాలని స్పష్టీకరణ

ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని స్పష్టం చేశారు. మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలకు స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. అసలు, ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడంలేదని రామకృష్ణ నిలదీశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటు క్యాంటీన్ లో బిర్యానీలు తిని నిద్రపోతున్నారా? అంటూ మండిపడ్డారు.

CPI
Ramakrishna
Andhra Pradesh
Amaravathi
YSRCP
Jagan
  • Loading...

More Telugu News