Andhra Pradesh: ఏపీ రాజధానిలోకి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నట్టు ఉంటుంది: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

  • సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన
  • ప్రజలు స్వాగతిస్తున్నారన్న తమ్మినేని
  • అమరావతి విషయంలో ఈ ఫీలింగ్ కలగలేదని వెల్లడి

ఏపీ రాజధాని అమరావతిపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం విస్మయం కలిగించేలా వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదు అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.

Andhra Pradesh
Amaravathi
Thammineni Sitharam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News