Chiranjeevi: తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే, అన్న మరో రాగం ఎత్తుకున్నారు: చిరంజీవిపై సోమిరెడ్డి విమర్శలు

  • మూడు రాజధానులంటూ కలకలం రేపిన సీఎం జగన్
  • మద్దతు పలికిన చిరంజీవి
  • ట్విట్టర్ లో స్పందించిన సోమిరెడ్డి

సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి తన మద్దతు ఉంటుందంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేయడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ గడ్డపై ఉంటూ సినిమాలు, వ్యాపారాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి అంటూ మండిపడ్డారు. ఓవైపు తమ్ముడు (పవన్ కల్యాణ్) ప్రజల కోసం పోరాడుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి, మరో రాగం ఆలపిస్తున్నారని విమర్శించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుచేసి, దాన్ని మరో పార్టీలో విలీనం చేశారని, ఆపై మంత్రి పదవి దక్కించుకుని రాష్ట్ర విభజన పాపంలో భాగమయ్యారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి వైఖరి చూస్తుంటే మళ్లీ దూకేస్తాడేమో అనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

Chiranjeevi
Pawan Kalyan
Andhra Pradesh
Somireddy
Telugudesam
YSRCP
Jagan
Amaravathi
Vizag
Jana Sena
Prajarajyam
  • Loading...

More Telugu News