Amaravathi: అమరావతి రైతుల ఆందోళనలకు వివిధ సంఘాల మద్దతు

  • కృష్ణా జిల్లాలో వివిధ సంఘాల మద్దతు
  • గుంటూరు జిల్లా న్యాయవాదులు కూడా
  • రేపు తమ విధులను బహిష్కరించనున్న న్యాయవాదులు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ సంఘాలు మద్దతుగా నిలవనున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు చేస్తున్న రైతులకు ఆయా సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించాయి. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్, లయోలా కళాశాల వాకర్స్ అసోసియేషన్, సిద్దార్థ కళాశాల వాకర్స్ అసోసియేషన్, ఇతర ప్రజా సంఘాలు నిరసనకు దిగనున్నాయి. అదేవిధంగా, గుంటూరు జిల్లా న్యాయవాదులు మద్దతు పలికారు. రేపు తమ విధులను బహిష్కరించనున్నారు.

Amaravathi
Farmers
Krishna
Guntur
  • Loading...

More Telugu News