Prathipati Pullarao: రైతులతో పాటే మేమూ జైలుకెళతాం: ప్రత్తిపాటి పుల్లారావు

  • రాజధాని మార్పుపై ఆగని నిరసనలు
  • అమరావతిలో రైతుల ధర్నాలు
  • హాజరైన టీడీపీ నేతలు

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతితో రైతులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనల్లో టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా టీడీపీ ఉందని, రైతుల కోసం తాము ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని, రైతులతోపాటే జైలుకు వెళతామని అన్నారు. త్యాగాలు చేసిన వాళ్లు ఎప్పుడూ మోసపోరని, రాజధాని రైతులను ఎవ్వరూ మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. అమరావతిని తరలించడం ఎవరికీ సాధ్యంకాదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ చట్టం రైతులకు అనుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంతో రైతులు ఒప్పందం కూడా చేసుకున్నారని ప్రత్తిపాటి వివరించారు.

Prathipati Pullarao
Telugudesam
Andhra Pradesh
Amaravathi
  • Loading...

More Telugu News