జీఎస్టీ దాడుల వార్తలపై మీడియాకు హితవు పలికిన యాంకర్ అనసూయ
- ఇటీవల హైదరాబాదులో జీఎస్టీ దాడులు
- యాంకర్ అనసూయ నివాసంలోనూ తనిఖీలు చేసినట్టు వార్తలు
- ట్విట్టర్ లో స్పందించిన అనసూయ
మీడియా సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలను అందించరాదని అన్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో సోదాలు జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని, ఒకరి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకుండా, నిర్ధారణ అయిన తర్వాతే వార్తలు అందించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అనసూయ ట్వీట్ చేశారు.