shashi tharoor: హిందూ మహిళలను అవమానపరిచాడని దాఖలైన కేసు: శశిథరూర్ కు అరెస్టు వారెంట్

  • 'ది గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌' అనే పుస్తకంలో వాక్యాలపై అభ్యంతరాలు
  • గతంలో కేసు నమోదు 
  • విచారణకు హాజరుకాని థరూర్

కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌ రాసిన 'ది గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌' అనే పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని గతంలో కేసు దాఖలైంది. ఈ కేసులో ఆయనకు  తిరువనంతపురంలోని ఓ స్థానిక కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు విషయంలో విచారణకు ఇటీవల శశిథరూర్‌ లేదా ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది.

అరెస్టు వారెంట్ జారీపై శశిథరూర్‌ కార్యాలయ ప్రతినిధులు స్పందించారు. థరూర్ కు వారెంట్ జారీ అయిన విషయం తమకు కూడా మీడియా ద్వారానే తెలిసిందని, అయితే, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. ఈ కేసు విషయంలో ఇటీవల థరూర్ కోర్టుకు హాజరుకావాలని సమన్లు వచ్చాయని, అందులో ఏ తేదీన  హాజరు కావాలో లేనందున ఆ విషయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

shashi tharoor
Congress
Kerala
  • Loading...

More Telugu News