RTC Depot: టైరుకు పంక్చర్ అయిందట... టీఎస్ఆర్టీసీ చరిత్రలో డ్రైవర్ కు వెరైటీ శిక్ష!

  • మహబూబాబాద్ డిపోలో ఘటన
  • సెమీ లగ్జరీ బస్ టైరుకు పంక్చర్
  • డిపో స్పేర్ జాబితాలో డ్రైవర్ పేరు
  • ఇదేం చోద్యమని వాపోయిన కార్మికులు

తాను తీసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు టైర్ కు పంక్చర్ చేసి తీసుకు వచ్చినందుకు అధికారులు ఓ వెరైటీ శిక్షను విధించారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఇటువంటి ఘటన ఆర్టీసీ చరిత్రలో అరుదైన అంశమని కార్మికులు అంటుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే, డ్రైవర్ గా పనిచేస్తున్న ఎండీ సాధిక్ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్ కు సెమీ లగ్జరీ బస్ ను తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో టైర్ పంక్చర్ కావడంతో బస్ లో ఉన్న స్టెప్నీని అమర్చుకుని తిరిగి డిపోకు చేరాడు. బస్సును నిలిపిన తరువాత లాక్ షీట్ లో టైర్ పంక్చర్ అయిన విషయాన్ని వెల్లడించాడు.

ఆపై మరుసటి రోజు డ్యూటీకి వెళ్లగా, గేటు వద్ద కనిపించిన దృశ్యం సాధిక్ తో పాటు ఇతర కార్మికులనూ ఆశ్చర్య పరిచింది. డిపో గేటు ముందు పంక్చర్ అయిన టైర్ ను నిలిపి, దానిపై సాధిక్ పేరును, నంబర్ ను రాశారు. డ్యూటీ చార్ట్ లో డిపో స్పేర్ జాబితాలో ఆయన పేరు రాశారు. అంటే, బస్సును తీయకుండా, ప్లాట్ ఫారాల వద్ద నిలబడి, కేకలు పెడుతూ, ప్యాసింజర్లను బస్ లోకి ఎక్కించాలి. దీంతో ఆయన చేసేదేమీ లేక, అవే విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. టైర్ పంక్చర్ సాధారణమని, ఇటువంటి పనిష్మెంట్ ను ఎన్నడూ చూడలేదని, ఇదేం చోద్యమని కార్మికులు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News