Nellore District: సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లింల భారీ ప్రదర్శన

  • బృందాలుగా విడిపోయిన నిరసనకారులు
  • సీఏఏ, ఎన్ఆర్‌సీ, మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు
  • కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లింలు గత రాత్రి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముస్లిం పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కోటమిట్ల మసీదు సెంటర్ నుంచి కొందరు, షాదీ మంజిల్ నుంచి మరికొందరు బ్యాచ్‌లుగా తరలివచ్చారు. అనంతరం అందరూ కలిసి వీఆర్‌సీ సెంటర్‌కు చేరుకుని ఎన్ఆర్‌సీ, సీఏఏ, ప్రధాని నరేంద్రమోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. మరో బృందం షాదీ మంజిల్‌ నుంచి చేపల మార్కెట్ మీదుగా గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.

Nellore District
NRC
CAA
  • Loading...

More Telugu News