Jai: ఇస్లాం మతం తీసుకున్నా... త్వరలోనే పేరు మార్చుకుంటా: తమిళ నటుడు జై

  • ఏడేళ్ల క్రితమే మతాన్ని మార్చుకున్నా
  • ఇంట్లో కూడా అభ్యంతరం చెప్పలేదు
  • అజీస్ జైగా పేరు మార్చుకుంటాడని టాక్

తాను ముస్లిం మతాన్ని స్వీకరించిన మాట వాస్తవమేనని, త్వరలోనే పేరును మార్చుకుంటానని తమిళ నటుడు జై స్పష్టం చేశాడు. దీంతో ఆయన మత మార్పిడిపై కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఇటీవల తన కొత్త చిత్రం 'కేప్ మారి' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఏడేళ్లుగా తాను ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నానని చెప్పాడు.

ఇంట్లో కూడా ఎవరూ అడ్డుకోలేదని, ఏ దేవుడినీ నమ్మని తాను, ఏదో ఒక దేవుడిని నమ్మడమే వారికి సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. మతం మారినా, ఇంతవరకూ పేరును మార్చుకోలేదని, త్వరలోనే పేరు మార్చుకుంటానని అన్నాడు. కాగా, తన పేరును అజీస్‌ జై అని పెట్టుకోవాలని జై భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'జర్నీ' తదితర చిత్రాలతో జై టాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు.

Jai
Islam
Tamilnadu
Kollywood
  • Loading...

More Telugu News