Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసు కేసు నమోదు!

  • ఇటీవల వైసీపీలో చేరిన సన్యాసినాయుడు
  • ఇంటిపై వైసీపీ జెండా కట్టడంతో గొడవ
  • బందోబస్తుకు వెళ్లిన వారిని దూషించిన అయ్యన్నపాత్రుడు

గతంలో పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఖరారు చేసిన నర్సీపట్నం టౌన్ సీఐ స్వామినాయుడు, అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు, తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టిన నేపథ్యంలో, ఈ నెల 12న అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు. ఇరు వర్గాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, తాము బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని అకారణంగా దూషించారని, దీనిపై కేసును రిజిస్టర్ చేశామని అన్నారు. కాగా, నర్సీపట్నం మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Ayyanna Patrudu
Sanyasinaidu
Police
Case
YSRCP
  • Loading...

More Telugu News