Sujana Chowdary: రాజధాని మార్పుపేర ప్రజాధనం వృథాచేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి

  • రాజధాని అమరావతికి కేంద్రం ఇప్పటికే నిధులు ఇచ్చింది
  • రాజధాని మార్పు విషయంలో నిధులు ఇచ్చే సమస్యే లేదు
  • కక్ష సాధింపు చర్య దిశగానే వైసీపీ ప్రభుత్వం సాగుతోంది

రాజధాని మార్పుపేర ప్రజాధనం వృథా చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ సుజనా చౌదరి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎంపీ మీడియాతో మాట్లాడారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నట్లు ఎంపీ చెప్పారు. కక్ష సాధింపు చర్య దిశగానే వైసీపీ ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. జీఎన్ రావు కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదిక ఇచ్చామని చెబుతోందని.. అయితే కమిటీ ఎక్కడ పర్యటించిందో తెలియడంలేదని పేర్కొన్నారు.

Sujana Chowdary
MP from BJP
Ap Capital issue
comments
  • Loading...

More Telugu News