TTD: క్రిస్మస్ వేడుకలకు హాజరవుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • ఈ వేడుకలకు రావాలని ఎవరూ ఆహ్వానించలేదు
  • కార్యక్రమ నిర్వాహకులతో నాకు సంబంధం లేదు
  • నా గౌరవానికి భంగం కలిగించాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు

రాజమహేంద్రవరంలో జరిగే ఓ క్రిస్మస్ వేడుకలకు తాను ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఇవన్నీ నిరాధార వార్తలంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని తనను ఎవరూ ఆహ్వానించలేదని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరో కావాలనే తన ప్రతిష్ఠకు భంగం కలిగించాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

TTD
Chairman YV Subba Reddy
Chrismas celebretations
The news are false which stated he participating in that celebrations
  • Loading...

More Telugu News