bjp Leader Purandheshwari comments: రైతులకు టీడీపీ, వైసీపీ సమాధానం చెప్పాలి: బీజేపీ నేత పురంధేశ్వరి

  • మొదటినుంచి బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తోంది
  • కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారు
  • రైతులకు సమాధానం చెప్పాకే మూడు రాజధానులపై మా వైఖరిని వెల్లడిస్తాం

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇటీవల వస్తోన్న విభిన్న వాదనల నేపథ్యంలో బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు. తమ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణను ఆది నుంచి సమర్థిస్తోందని చెప్పారు. అమరావతి  ప్రాంత రైతులు రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. టీడీపీ, వైసీపీలు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రం రాజధాని కోసం నిధులు ఇచ్చినప్పటికీ.. చంద్రబాబు గ్రాఫిక్స్ కే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇంకా పూర్తిగా బహిర్గతం కాలేదంటూ.. దీనిపై కేబినెట్ లో చర్చ జరగాలని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాకే మూడు రాజధానులపై తమ పార్టీ తన వైఖరిని వెల్లడిస్తుందన్నారు.

bjp Leader Purandheshwari comments
On AP Capital
  • Loading...

More Telugu News