Gautam Gambhir: గంభీర్ ను చంపేస్తామంటూ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్

  • ఢిల్లీ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్
  • బెదిరింపు కాల్స్ పై డీసీపీకి లేఖ
  • తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ముక్కుసూటి వ్యక్తి. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడడం ఆయన నైజం. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. తాజాగా, ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరిస్తున్నారంటూ గంభీర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గంభీర్ డీసీపీకి లేఖ రాశారు. గంభీర్ గత ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు పోటీచేసి విజయం సాధించారు.

Gautam Gambhir
New Delhi
BJP
Lok Sabha
Police
Cricket
  • Loading...

More Telugu News