nagababu: 'ప్రపంచానికి మరో హీరో కాదు.. రాక్షసుడు కావాలి' అన్న నాగబాబు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

  • రాజధాని గురించి నాగబాబు ట్వీట్?
  • అర్థం కావట్లేదంటోన్న నెటిజన్లు
  • 'అవును మాకు పీకే వద్దు.. జగన్ కావాలి' అంటూ కొందరి రిప్లై

'కొన్ని సార్లు ప్రపంచానికి మరో హీరో అవసరం ఉండదు.. రాక్షసుడి అవసరం ఉంటుంది' అంటూ సినీనటుడు, జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. నిన్న మందడంలో జనసేన నేతలతో కలిసి వెళ్లి నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'రాక్షసుడి అవసరం ఉంటుంది' అంటూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

నాగబాబు చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. జగన్ గురించా సర్? అని ఒకరు ప్రశ్నించారు. 'అవును మాకు పీకే వద్దు.. జగన్ కావాలి' అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. 'ప్రపంచానికి రియల్ హీరోలు కావాలి కానీ, రీల్ హీరోలు కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇప్పుడు మనకు హీరో, రాక్షసుడు కాదు డైనోసర్ అవసరం' అని మరొకరు పేర్కొన్నారు. 'అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్ధమవుతుందా? కామెడీ బాబా..?' అని ఒకరు ఎద్దేవా చేశారు. 

nagababu
Andhra Pradesh
Jana Sena
Twitter
  • Loading...

More Telugu News